Allindiaforwardbloc.com

Categories
Articles

79 th independence day Celebrations

స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో
www.allindiaforwardblocparty.com

స్వేచ్ఛ, సమానత్వపు సమరయోధుడు
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వ్యవస్థాపకుడు నేతాజి
నేతాజి కలలు కన్న స్వేచ్ఛాయుతమైన సాధికారతను సాధించడానికి ఇపుడు తెలంగాణలో మరో పోరాటం అనివార్యమైంది. స్వార్థ రాజకీయం, కుటుంబ రాజకీయం, మత రాజకీయాలతో యువతరపు భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యువతకు అన్ని రంగాలలో అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యువతరానికి సంబందించిన విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేయకపోవటం సిగ్గుచేటు.
దేశానికి వెన్నముఖ అయిన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నేతాజి సంకల్పం. ఆ ఆశయంతోనే నేతాజి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు నేతాజి చూపిన మార్గంలో పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బండ సురేందర్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కమిటి సభ్యులతో పాటుగా ఉమ్మడి జిల్లాలలో ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కమిటీ సభ్యులతో పార్టి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈనాటి రాజకీయాలలో ధనమే పరమావధిగా మారటం మూలంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం చేపట్టలేకపోయింది.
నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో సామాజిక తెలంగాణలో రాజ్యాధికార సమానత్వం, అణగారిన వర్గాలకు అధికారం అందించడానికి సరికొత్త కార్యాచరణను చేపట్టింది. నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టి సిద్ధాంతాలను అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపరచడానికి పార్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ సందర్భంగా రాజకీయాలలోకి యువతను సాదరంగా ఆహ్వానిస్తోంది.
ఇంటింటికీ నేతాజి
ఇంటింటికీ నేతాజి కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టి గ్రామ, మండల, జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను స్థానిక యువత భాగస్వామ్యంతో రూపొందించి అభివృద్ధి కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది.
యువత ఆలోచనలు గ్రామాభివృద్ధికి దోహదపడే అవకాశముంది ! ఒక్క సారి ఆలోచించండి !! మీ రాజకీయ ప్రవేశం రాబోయే తరానికి ఆదర్శమవుతుంది !!!
-బండ సురేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ – తెలంగాణ రాష్ట్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *