
తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చింది.ప్రధాన ప్రతిపక్షం అవినీతి ఆరోపణలు ,కుటుంబ సంక్షోభంతో ప్రతిపక్ష పాత్రకు న్యాయం చేయడంలేదు.మరో జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిల్లిగవ్వకూడా కెటాయించకుండా ఎన్నికలప్పుడు మాత్రం హిందుత్వ ఎజెండాను ప్రచారంలోకి తెస్తోంది.
ఈ నేపధ్యంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటి చేయాలని తీర్మానించి ఎం.బి.సి సామాజికవర్గానికి చెందిన మన్నారం నాగరాజును పోటిలో నిలిపింది.పార్టీ నాయకులతో కలసి మన్నారం నాగరాజు మంగళవారం రోజు షెక్ పేట మండల కార్యాలయంలో నామినేషన్ ను దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం రిజ్ర్వేషన్ ల పేరుతో బిసిలను కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడానికి ఉన్న నిబంధనల ప్రక్రియను సజావుగా నిర్వహించకుండా మభ్యపెడుతూ బిసి సామాజికవర్గ ప్రజలను తప్పుదోవపట్టించింది.కేంద్రంలో ఉన్న బిజెపి బిసిల గోడును పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది.వెనుకబడిన తరగుతుల సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ అభివృద్ధికి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కట్టుబడి ఉంది.
ఈ సంధర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజక వర్గ ప్రజలు తమ సమస్యల పట్ల స్పందించే నాయకులు ఎవరో ఆలోచించాలి. సమాజ శ్రేయస్సును కోరుకునే అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభర్థి మన్నారం నాగరాజు కు ఓటువేసి తమ మద్దతును తెలపాలని కోరారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ చైర్మన్ జావిద్ లతీఫ్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి అంబటి జోజు రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ వి ప్రసాద్ గారు, జాతీయ రైతు సంఘం నాయకులు అందే వీరన్న గారు,రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మూర్తి గారు,నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి రాజుగారు, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గారు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాము యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు,